ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు అప్పటి చంద్రబాబు సర్కారు వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను చెల్లించకుండా బకాయిపెట్టింది. ఆ మొత్తాలను చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ ఉన్నతాధికారులను గతంలోనే ఆదేశించారు.
దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు విడతల చెల్లింపులు జరిపిన ఆర్టీసీ అధికారులు.. చివరి రెండు విడతల బకాయిలను కూడా ఈ నెలాఖరు నాటికి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.