ఆంధ్రప్రదేశ్ నుండి చత్తీస్‌గడ్ హైకోర్టుకు బదిలీపై వెళుతున్న చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి, మీనాక్షి గోస్వామి దంపతులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం జస్టిస్ గోస్వామిని రాజ్ భవన్‌కు ఆహ్వానించిన గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. గోస్వామిని శాలువా, మెమొంటోతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మరో రాష్ట్రానికి బదిలీపై వెళుతున్న నేపథ్యంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందాలని అకాంక్షించారు. మరిన్ని ఉన్నత పదవులు పొంది రాజ్యంగ బద్దమైన సేవ ద్వారా సమాజానికి మంచి చేయాలని ప్రస్తుతించారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి సుప్రవ హరిచందన్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.