ప్రభుత్వ పాలసీలు ఇకపై వారికి అనుకూలంగానే ఉంటాయి: సీఎం చంద్రబాబు

చనిపోయాక కూడా పది మంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి, అందుకే మానవత్వంలో ముందుకు పోవాలి..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు.

By Knakam Karthik
Published on : 19 Aug 2025 2:39 PM IST

Andrapradesh, Cm Chandrababu, Ap Government, Government policies, P4 Programe

ప్రభుత్వ పాలసీలు ఇకపై వారికి అనుకూలంగానే ఉంటాయి: సీఎం చంద్రబాబు

చనిపోయాక కూడా పది మంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి, అందుకే మానవత్వంలో ముందుకు పోవాలి..అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 అమలు కార్యక్రమాన్ని మంళగిరిలో మంగళవారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమాన్ని ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బంగారు కుటుంబాలు- మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. మార్గద ర్శలుగా 1.40 లక్షల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులు ముందుకొచ్చారు. వీరిలో కొంతమందిని ఈ రోజు పరిచయం చేశారు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్య లను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..ఒక వ్యక్తి ఒకేసారి 121 కేజిల బంగారం అంటే 140 కోట్లు ఇచ్చారు. అందరం ఓ రోజు చనిపోతాం ఎవ్వరూ శాశ్వతం కాదు. కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు ...కొందరు దుర్వినియోగం చేసుకుంటారు. చనిపోయాక కూడా 10 మంది గుర్తుపెట్టుకునే పనులు చేయాలి...అందుకే మానవత్వంతో ముందుకు పోవాలి. సమాజం ఇచ్చిన అవకాశాన్ని నేనే సద్వినియోగం చేస్తున్నా... మీరు కూడా మీ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. పీ4పై శక్తి ఉండే ప్రతి వ్యక్తి అండగా ఉండాలి.... గివ్ బ్యాక్ అనేది మన సమాజ నినాాదం కావాలి. కోటి 69 లక్షల కుటుంబాలు ఉన్నాయి... వీటిలో 21 లక్షలు అవసరం ఉన్నవి ఉన్నాయి. సమాజం వల్ల పైకి వచ్చాన వారు తిరిగి సమాజానికి ఎంతో కొంత తిరిగి చేయాలి. సంపద ప్రజలకు మెరుగైన జీవనం కలిగేలా ఉపయోగపడాలి. ఉగాది రోజు ఈ కార్యక్రమం గురించి మొదటి సారిగా చెప్పి నేడు ప్రారంభిస్తున్నాం. 13,40,600 బంగారు కుటుంబాలను ఇప్పడు మార్గదర్శులు దత్తతు తీసుకుంటున్నారు. 15 లక్షలు టార్గెట్ గా పెట్టుకున్నాం... ఇది మానవతా దృక్పథంతో చేసే స్వచ్చంద కార్యక్రమం. దీనిలో ఎలాంటి బలవంతం లేదు... మీరు ఈ కార్యక్రమంలో పాల్గోంటే మీకు గొప్ప తృప్తి కలుగుతుంది. 250 కుటుంబాలను నేనే దత్తత తీసుకొని వారిని స్వయంగా మానిటర్ చేస్తున్నా. ఇకపై ప్రభుత్వ పాలసీలు పేదలకు అనుకూలంగానే ఉంటాయి అదే సమయంలో సంపద సృష్టించాలి. ఏమాత్రం మనస్సున్నా పి4 ఆచరణ సాధ్యమే..అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story