గుడ్‌న్యూస్‌.. ఏపీలో పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్‌ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  24 Oct 2024 6:37 AM IST
AP government, pensions, AndhraPradesh, CM Chandrababu

గుడ్‌న్యూస్‌.. ఏపీలో పింఛన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్‌ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. బుధవారం ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అనర్హులపై మాత్రం వేటు తప్పదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది దివ్యాంగుల కేటగిరిలో ఎక్కువమంది తప్పుడు సదరం సర్టిఫికెట్లతో పింఛన్లు పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే పింఛన్ల తనిఖీతో పాటుగా కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన కోసం 8 మంది మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అటు మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేవాలయ పాలక మండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.

Next Story