సంక్రాంతి పండుగ సెలవుల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఖరారు చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు 9 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవు తేదీలు ఇవేనని అధికారులు స్పష్టం చేశారు. పండుగ తరువాత జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సూచించారు. కాలేజీల సెలవుల గురించి ప్రకటన రావాల్సి ఉంది. అటు తెలంగాణలోనూ స్కూళ్లకు ఇవే తేదీల్లో సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.