బాలయ్య గురించి హాట్ కామెంట్స్ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్

Gorantla Madhav Comments On Balakrishna. కొద్దిరోజుల కిందట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి

By Medi Samrat  Published on  13 March 2021 7:15 PM IST
బాలయ్య గురించి హాట్ కామెంట్స్ చేసిన ఎంపీ గోరంట్ల మాధవ్

కొద్దిరోజుల కిందట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ యువకుడిని కొట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే..! ఆ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ టీడీపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేశ్ లను విమర్శించారు.

రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని.. చంద్రబాబు ముసలివాడు అయిపోయారని, ఆయన కొడుకు లోకేశ్ కి నోట మాట రాదని విమర్శించారు. పంక్చరైన సైకిల్ ను చంద్రబాబు వయోభారంతో తొక్కలేక తొక్కుతున్నారని అన్నారు. బాలకృష్ణ రాత్రి ఫుల్ బాటిల్ కొడతారని, పగలు జనాలను కొడతారని మాధవ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాక.. హిందూపురం జనాలు బెంబేలెత్తిపోతున్నారని.. ఆయన పక్కన నిల్చోవడానికి కూడా వణికిపోతున్నారని అన్నారు. ఆయన చేత దెబ్బలు తిన్నవాళ్లు, బూతులు తిట్టించుకున్నవాళ్లు ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ఓటేసిన పాపానికి శిక్షను అనుభవించడానికి అభిమానులు సిద్ధంగా లేరని అన్నారు.


Next Story