గోరంట్ల మాధవ్‌కు కీల‌క ప‌దవి

జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండటం వల్ల దీనికి అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి.

By Kalasani Durgapraveen  Published on  21 Dec 2024 6:30 AM IST
గోరంట్ల మాధవ్‌కు కీల‌క ప‌దవి

జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండటం వల్ల దీనికి అనుగుణంగా YSRCP పార్టీలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి. వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియామకాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ కమిటీల వరకూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రివర్గం సైతం దీనికి ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లు సభ ముందుకు సైతం వచ్చింది. ఫలితంగా 2027 నాటికి జమిలి ఎన్నికలు జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది.

పరిస్థితుల్లో ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఇదివరకే రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. దీన్ని మరింత వేగవంతం చేశారాయన.

శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు గోరంట్ల మాధవ్‌కు పార్టీలో హోదా కల్పించారు. ఆయనను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేర‌కు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Next Story