రైతులకు గుడ్‌న్యూస్‌.. 35% రాయితీపై అద్దెకు గోదాములు

సచివాలయంలో ఏపి సీడ్స్, మార్క్ఫెడ్, ఏపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.

By Kalasani Durgapraveen  Published on  16 Dec 2024 8:30 AM GMT
రైతులకు గుడ్‌న్యూస్‌..  35% రాయితీపై అద్దెకు గోదాములు

సచివాలయంలో ఏపి సీడ్స్, మార్క్ఫెడ్, ఏపి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారుల‌కు సూచించారు. చిరుధాన్యాలు, తృణధాన్యాలు సాగు, వినియోగం పెంచే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించేందుకు చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

రైతులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 35% రాయితీపై గోదాములు అద్దెకు ఇచ్చి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించే వెసులుబాటు క‌ల్పించాల‌ని సూచించారు. రాయితీపై రైతులకు పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు అందించి, భూసారం పెంపు, నాణ్యమైన దిగుబడి వృద్ధికి కృషి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను అవగాహన కల్పించి నూరు శాతం సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు.

Next Story