మందుబాబుల‌కు ఏపీలో గుడ్‌న్యూస్‌.. తెలంగాణ‌లో షాకింగ్ న్యూస్‌

Good news For Drinkers In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మందుబాబుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది.

By Medi Samrat  Published on  25 Dec 2020 4:08 AM GMT
మందుబాబుల‌కు ఏపీలో గుడ్‌న్యూస్‌.. తెలంగాణ‌లో షాకింగ్ న్యూస్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మందుబాబుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఈ నెల 31వ తేదీ, జనవరి 1న మద్యం దుకాణాలు, బార్లపై ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న కారణంగా ఈ నెల 31వ తేదీ అలాగే జనవరి ఒకటో తేదీ నాడు పూర్తి స్థాయి కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని మందుబాబులు తెగ ఆందోళ‌న చెందుతున్నారు. అయితే.. అలాంటిది ఏమీ లేద‌ని.. ఆయా రోజుల్లో య‌ధావిధిగా మ‌ద్యం దుకాణాలు, భార్లు తెరుచుకోనున్నాయని వెల్ల‌డించింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్బంగా పని వేళ్లల్లో ఎలాంటి మార్పులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నేటి నుంచి తెలంగాణ‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు షురూ..

తెలంగాణ‌లోని మందుబాబుల‌కు షాకింగ్ న్యూస్ ఇది. ఇక ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ తాగి ఇంటికి చేరుకోవ‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల‌ను పోలీసులు మ‌ళ్లీ చేప‌ట్ట‌నున్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కొంతకాలంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. నేటి నుంచి (శుక్ర‌వారం) నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల‌ను పునఃప్రారంభించ‌నున్నారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ నిర్ధారించారు. కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో వారం రోజుల ముందు నుంచే ఈ ప్రత్యేక తనిఖీలు షురూ చేయనున్నారు. ఇక రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే తనిఖీలు జరుగుతున్న విషయం తెలిసిందే.

కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ ఫేస్‌ షీల్డ్‌లు ధరించి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు చేయనున్నారు. బ్రీత్‌ అనలైజర్‌కు ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేసి, భౌతిక దూరం పాటిస్తూ ఈ టెస్టులు నిర్వహించేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తాగి నడిపుతూ పట్టుబడితే బండిని సీజ్ చేయడంతో పాటు‌ భారీగా జరిమానాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




Next Story