ఆ ఆరు చోట్ల త‌ప్ప‌.. మిగ‌తా అన్ని స్థానాల్లో కొన‌సాగుతున్న‌ ఓట్ల‌ లెక్కింపు ప్రక్రియ

Genaral Body Election Counting Started. ఓట్ల‌ లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి

By Medi Samrat  Published on  19 Sep 2021 6:21 AM GMT
ఆ ఆరు చోట్ల త‌ప్ప‌.. మిగ‌తా అన్ని స్థానాల్లో కొన‌సాగుతున్న‌ ఓట్ల‌ లెక్కింపు ప్రక్రియ

ఓట్ల‌ లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి.కె. ద్వివేది అన్నారు. 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. పలు కారణాలతో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని.. రెండుచోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు ప‌ట్టాయ‌ని, మిగిలిన నాలుగు చోట్ల తడిచాయని పేర్కోన్నారు. తాడికొండ మం. రావెల, బేజాతపురం, శ్రీకాకుళం జిల్లా షలాంత్రిలో బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నాయని తెలిపారు.

విశాఖలోని తూటిపల్ల, పాపయ్యపాలెంలో బ్యాలెట్లు తడిచాయ‌ని ద్వివేది తెలిపారు. బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్‌పై కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులదే నిర్ణయమ‌ని ద్వివేది అన్నారు. రీపోల్ అవసరమనుకుంటే ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంద‌ని అన్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు త్వరలోనే వస్తాయ‌ని.. జడ్పీటీసీ ఫలితాలు సాయంత్రం, రాత్రి వరకు వస్తాయ‌ని ద్వివేది తెలిపారు.


Next Story
Share it