ఏపీలో 2 కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు.. నేడు గెజిట్ రిలీజ్?
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
By - Knakam Karthik |
ఏపీలో 2 కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు..నేడు గెజిట్ రిలీజ్?
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాలుగా మార్కాపురం, మదనపల్లి ఏర్పాటు చేయాలని కేబినెట సబ్ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక అందించింది. దీంతో రాష్ట్రంలో ఇక నుంచి 28 జిల్లాలు ఉండబోతున్నాయి. కొత్త జిల్లాల్లో 21 మండలాలు ఉండనున్నాయి. అటు నక్కపల్లి, పీలేరు, అద్దంకి, మడకశిరలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. వీటితో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లు 81కి చేరనున్నాయి.
అటు పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటుపై నేడు కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ఇక బాపట్ల జిల్లా నుచి అద్దంకి మళ్లీ ప్రకాశంలోనే చేర్చాలని ప్రతిపాదించింది. నూజివీడు, గన్నవరం నియోజకవర్గా్లోని నాలుగు చొప్పున మండలాలను ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేసేందుకు ప్రతిపాదించింది. కైకలూరు డివిజన్‌లో 4 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదనలు తెలిపింది. కందుకూరు డివిజన్‌లోని 5 మండలాలను మళ్లీ ప్రకాశంలో విలీనం చేసే ప్రతిపాదనలు సూచించింది. పలు డివిజన్లు, మండలాల పునర్‌వ్యవస్థీకరణకు ఉప సంఘం ప్రతిపాదన తెలిపింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి నేడు గెజిట్ విడుదల అయ్యే అవకాశం ఉంది.