మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మాజీ మంత్రి గంటా

Ganta Srinivasarao Meet With Chiranjeevi. మాజీ మంత్రి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. మెగాస్టార్ చిరంజీవితో

By Medi Samrat  Published on  8 Oct 2022 5:29 PM IST
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన మాజీ మంత్రి గంటా

మాజీ మంత్రి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. మెగాస్టార్ చిరంజీవితో హైదరాబాద్ లో భేటి అయ్యారు. చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే చిరుని అభినందించేందుకే తాను కలిశానని గంటా చెప్పారు.

అయితే.. వీరిద్దరి మధ్య తెలుగు రాష్ట్రాల‌లోని తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వ‌చ్చిన‌ట్టు ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న గంటా.. గత కొంతకాలంగా టీడీపీకి, ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున గంటా శ్రీనివాస్ శాసనసభ్యుడిగా గెలిచారు. అనంతర పరిణామాలతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యవహరించారు.


Next Story