చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాన మంత్రి ఎందుకు అవ్వకూడదు.? అని మాజీమంత్రి, భీమిలీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కుమారుడు గంటా రవితేజ అన్నారు. ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నారా లోకేష్ నాలాంటి ఎంతో మంది యువతకు స్పూర్తి.. ఆయన లాంటి వారు రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం చాలా ఉందని అన్నారు. గతంలో యూఎస్ లో చదువుకునే రోజుల్లో ఢిల్లీలో లోకేష్ అన్నయ్యను చాలా సాదాసీదాగా చూశానని.. కానీ ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతారని అనుకోలేదని అన్నారు. మంత్రిగా విద్యావ్యవస్థలో ఆయన తెస్తున్న మార్పులను చూస్తున్నామని, మధ్యాహ్న బోజనం విషయంలో ఆయన సీరియస్ యాక్షన్ తీసుకొని అమలు చేయడం జరిగిందన్నారు. అలాగే టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రీమియం 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారని, ఈ నిర్ణయానికి లోకేష్ అన్నకి హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ లాంటి రాజకీయ నాయకుడు మనకు చాలా అవసరమని అన్నారు. అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు కానీ నారా లోకేష్ అన్న పీఎం కావాలి. ఏదో ఒకరోజు లోకేష్ ను ప్రధాన మంత్రిగా చూడాలని నా కోరిక అని రవితేజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.