గన్నవరం ఎమ్మెల్యే వంశీకి అస్వస్థత

Gannavaram MLA Vallabhaneni Vamsi Hospitalized. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు.

By Medi Samrat
Published on : 22 Jun 2022 9:40 AM IST

గన్నవరం ఎమ్మెల్యే వంశీకి అస్వస్థత

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ కోర్సు చేస్తున్నారు. ఈ కోర్సులో తరగతులకు హ‌జ‌ర‌య్యేందుకు పంజాబ్ లోని మొహాలీకి వెళ్లారు. మూడో సెమిస్టర్ తరగతులు జరుగుతుండటంతో ఆయన అక్కడే ఉన్నారు. అక్క‌డే ఆయన అస్వస్థతకు గురయ్యారు.

ఎడమ చేయి తీవ్రంగా లాగడంతో ఇబ్బంది పడ్డ వంశీ.. వెంటనే ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలని సూచించారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయ‌నున్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. ప్ర‌స్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సీఎం జ‌గ‌న్‌ను ప‌లుమార్లు క‌లిసిన ఆయ‌న‌.. వైసీపీ కి స‌న్నిహితంగా ఉంటున్నారు.










Next Story