ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది.

By Medi Samrat  Published on  19 Aug 2023 1:53 PM GMT
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది. గన్నవరం నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఎమ్మెల్యే కాన్వాయ్‌ కి ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని వాహ‌నాలు ఒక‌దానితో ఒక‌టి ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాసీంపేట వద్ద చోటుచేసుకుంది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఎమ్మెల్యే వంశీ సురక్షితంగా హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. ప్రమాదం కార‌ణంగా వాహనాలు స్వ‌ల్పంగా దెబ్బతిన్నాయి.

Next Story