వచ్చారు.. రిపోర్ట్ చేశారు..!

ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సీఎస్ కు నేడు రిపోర్టు చేశారు

By Medi Samrat
Published on : 17 Oct 2024 5:39 PM IST

వచ్చారు.. రిపోర్ట్ చేశారు..!

ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ సీఎస్ కు నేడు రిపోర్టు చేశారు. ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణలోనే కొనసాగాలని భావించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. తెలంగాణ హైకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. దాంతో నలుగురు ఐఏఎస్ అధికారులు బుధవారం సాయంత్రం తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వగా, నేడు ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేడర్‌లకు తమ కేటాయింపులపై పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ (డిఓపిటి) ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఎఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.

Next Story