టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, తణుకు మాజీ ఎమ్మెల్యే వై.టీ. రాజా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన‌ప‌డిన ఆయ‌న ఇటీవ‌లే కోలుకున్నారు.

రాజా మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేష్‌తో పాటు పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతితో నియోజ‌క‌వ‌ర్గంలో విషాదచాయ‌లు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇదిలావుంటే.. వైటీ రాజా 1999లో తణుకు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్ధిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004, 2009లో ఆయన పరాజయం పాలయ్యారు. 2014 నుంచి ఆయన రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు.
సామ్రాట్

Next Story