అదే జిల్లా నుంచి మ‌రో షాక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రోశయ్య రాజీనామా

మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

By Medi Samrat  Published on  24 July 2024 3:40 PM IST
అదే జిల్లా నుంచి మ‌రో షాక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రోశయ్య రాజీనామా

గుంటూరు జిల్లాలో వైసీపీకి మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. ఇటీవ‌ల గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మ‌ద్దాళి గిరి పార్టీని వీడిన విష‌యం మ‌రువ‌క‌ముందే.. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రోశయ్య 2019లో పోన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ నేత‌ ధూళిపాళ్ల నరేంద్రపై గెలిచారు .

2024 సార్వత్రిక ఎన్నికల్లో రోశయ్య గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. ప్ర‌స్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్‌పై ఓడిపోయారు. బుధ‌వారం తన అనుచరులతో సమావేశం అయిన రోశయ్య.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధినాయ‌కుడు ఢిల్లీలో రాజీనామా చేస్తున్న వేళ రోశ‌య్య పార్టీని వీడ‌డంపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిప‌డుతున్నాయి.

Next Story