చివరికి వైసీపీలో చేరిన రావెల
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరారు
By Medi Samrat Published on 31 Jan 2024 7:03 PM ISTమాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరారు. గత కొంత కాలంగా రావెల పార్టీ మారబోతున్నారంటూ వస్తోన్న వార్తలను నిజం చేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రావెల అధికార వైసీపీ పార్టీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రావెల కిశోర్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రావెల కిశోర్‌కు పార్టీ కండువా కప్పి సీఎం జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు.
పదవులు ఆశించి వైసీపీలోకి రాలేదని రావెల కిశోర్ అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వ హయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చూసి వైసీపీలో చేరానని స్పష్టం చేశారు. అందరిని కలుపుకుని ముందుకు వెళ్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలుపును ఎవరూ ఆపలేరని రావెల ధీమా వ్యక్తం చేశారు. చేరిక సందర్భంగా టికెట్ల విషయంలో వైసీపీకి ఎలాంటి షరతులు విధించలేదని క్లారిటీ ఇచ్చారు.