వైసీపీ నేతలపై దాడులను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఖండించారు. కూటమి నేతలు ఆటవిక పాలనకు తెరలేపారని, ఏపీని రావణకాష్ఠంగా మార్చారన్నారు. కూటమి నేతలకు దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి సవాలు విసరాలని ఛాలెంజ్ చేశారు. మరో మూడేళ్ల పాటు ఆటవిక పాలనను భరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 2029లో రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని అన్నారు. కాపు, బీసీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, తిరుమల లడ్డూ గురించి దుష్ప్రచారం చేసి అడ్డంగా దొరికేశారని, దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్నారు.