కాంగ్రెస్‌తో టచ్‌లో చంద్రబాబు..ఏపీ గురించి రాహుల్ అందుకే మాట్లాడరు: జగన్

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

By Knakam Karthik
Published on : 13 Aug 2025 3:00 PM IST

Andrapradesh, Ys Jagan, Cm Chandrababu, Congress, RahulGandhi

కాంగ్రెస్‌తో టచ్‌లో చంద్రబాబు..ఏపీ గురించి రాహుల్ అందుకే మాట్లాడరు: జగన్

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఓట్ల చోరీ జరిగిందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలపై జగన్ బుధవారం తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో రాహుల్ హాట్ లైన్‌లో టచ్ లో ఉన్నాడు. ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్ ఎప్పుడైనా చంద్రబాబు గురించి మాట్లాడారా? ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తుంటే ఏనాడైనా ప్రశ్నించారా? కళ్ల ముందే చంద్రబాబు స్కామ్‌లు చేస్తుంటే ఎప్పుడు మాట్లాడరు. ఎంఆర్‌పీ రేట్ల కంటే మద్యం ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు..ఎప్పుడైనా మాట్లాడారా? నా గురించి మాత్రం మాట్లాడుతారు. రేవంత్, చంద్రబాబు, కాంగ్రెస్ హైకమాండ్ హాట్‌లైన్‌లో మాట్లాడుకుంటారు. ఏపీలో ఓటు చోరీ జరిగిన రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే వారు హాట్ లైన్‌లో మాట్లాడుకుంటారు.. అని జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Next Story