రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది: జగన్

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 26 July 2025 2:52 PM IST

Andrapradesh, Ap Government, Ys Jagan, Cm Chandrababu, CAG Report

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది: జగన్

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని మాజీ CM విమర్శించారు. ఇందుకు సంబంధించిన కాగ్ నివేదికను ఆయన 'X'లో షేర్ చేశారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు గతేడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. రాష్ట్ర సొంత ఆదాయాలు 3.47% మాత్రమే పెరిగాయి. కేంద్రం నిధులు సహా మొత్తం ఆదాయం 6.14 శాతమే పెరిగింది. 3 నెలల్లో అప్పులు మాత్రం 15.61% పెరిగాయి' అని ట్వీట్ చేశారు.

కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని మాజీ సీఎం జగన్ అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాగ్ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అనిశ్చితిని స్పష్టంగా సూచిస్తున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక నిర్వహణ సవాలుతో కూడుకున్నదని తెలిపారు. కానీ.. సంక్షేమం, అభివృద్ధి అవసరమైన రంగాల్లో సరైన ప్రభుత్వ వ్యయం మాత్రమే ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ తరుణంలో మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను, పన్నుయేతర ఆదాయాలు రెండింటిలోనూ ఆర్థిక స్థితి నిరాశాజనకంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆదాయాలలో కొన్ని వర్గాల్లో అతి తక్కువ వృద్ధి, ప్రతికూల వృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. రాష్ట్రం ఆర్థిక ఉత్సాహం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. జీఎస్టీ, అమ్మకపు పన్ను వినియోగాన్ని ప్రతిబింబిస్తాయని కాగ్ విడుదల చేసిన లెక్కల్లో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

Next Story