ఏపీలో మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత..!

Food poison in elementary school in andhra pradesh. మధ్యాహ్న భోజనం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డిపల్లిలోని

By అంజి  Published on  5 Nov 2021 6:24 PM IST
ఏపీలో మధ్యాహ్న భోజనం వికటించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత..!

మధ్యాహ్న భోజనం తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డిపల్లిలోని స్కూల్‌లో జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో విద్యార్థులు భోజనం చేశారు. మొదటగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. టీచర్లు వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్న పిల్లల ఆరోగ్యాన్ని చూసే పిడియాట్రిక్‌ వైద్యుడు లేకపోవడంతో తాడిపత్రికి తరలించాలని సూచించారు. మొదటగా ఏడుగురు విద్యార్థులను అంబులెన్స్‌ వాహనం ద్వారా తాడిపత్రిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాడిపత్రిలో అస్వస్థతకు గురైన విద్యార్థులకు చికిత్స అందిస్తుండగా.. స్కూల్‌లో ఉన్న మరో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురి అయిన విద్యార్థుల మానసిక స్థతి సరిగా లేదని తెలుస్తోంది. తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో విద్యార్థులకు చికిత్సం చేయడం సాధ్యం కాలేదు. దీంతో వారిని అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. ఫస్ట్‌ ఎయిడ్‌ తర్వాత 12 మంది విద్యార్థులను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తిప్పారెడ్డిపల్లిలోని స్కూల్‌లో 18 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఇవాళ్లి మధ్యాహ్న భోజనం మెనూలో భాగంగా అన్నం, ఆకుకేరపప్పు, చిక్కీలు, కోడిగుడ్లు పెట్టారు. విద్యార్థులకు వడ్డించిన ఆహారం స్కూల్‌ ఆవరణలో టీచర్ల పర్యవేక్షలో చేసింది కాదని తెలిసింది. వంటలు చేసే ఆమె.. తన ఇంటి వద్దనే వండుకొని పాఠశాలకు తీసుకువచ్చి వడ్డించిందని, అక్కడే ఏదో జరిగి ఉంటుందని తల్లిదండ్రులు అంటున్నారు.

Next Story