అనకాపల్లిలో ఘోర‌ప్ర‌మాదం.. నిర్మాణ ద‌శ‌లోనే కుప్ప‌కూలిన‌ ఫ్లైఓవర్

Flyover Bridge Collapse At Anakapalli. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా విశాఖ జిల్లా, అనకాపల్లి వై జంక్షన్ లో

By Medi Samrat  Published on  6 July 2021 1:42 PM GMT
అనకాపల్లిలో ఘోర‌ప్ర‌మాదం.. నిర్మాణ ద‌శ‌లోనే కుప్ప‌కూలిన‌ ఫ్లైఓవర్

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా విశాఖ జిల్లా, అనకాపల్లి వై జంక్షన్ లో నిర్మిస్తున్న భారీ వంతెన నిర్మాణంలో ఉండగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. గత 2 ఏళ్ళ నుండి జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. నాణ్యతా లోపం కారణమా లేదా సాంకేతిక లోపమా అనేది తెలియాల్సి ఉంది. ఒక్క‌సారిగా చోటుచేసుకున్న‌ ఈ విప‌త్తుతో స్థానిక జ‌నం భ‌యంతో అక్క‌డి నుండి ప‌రుగులు తీశారు. ప్రమాదం సంభవించడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం చోటు చేసుకుంది. వంతెన కిందప‌డి ప‌దుల సంఖ్య‌లో వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.Next Story
Share it