ఎగిరే పచ్చ కప్పు.. ఎప్పుడైనా మీరు చూశారా ?

Flying Yellow Frog. సాధారణంగా మనం కప్పలను చూస్తూ ఉంటాం. అవి కూడా కొద్దిగా

By Medi Samrat  Published on  30 Dec 2020 5:35 AM GMT
ఎగిరే పచ్చ కప్పు.. ఎప్పుడైనా మీరు చూశారా ?

సాధారణంగా మనం కప్పలను చూస్తూ ఉంటాం. అవి కూడా కొద్దిగా ముదురు గోధుమ రంగులో ఉండి ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ పసుపు రంగులో ఉండి ఎగిరే అరుదైన కప్ప తాజాగా కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయంలో చేసింది. ఈ కప్ప గురించి ప్రముఖ యోగి వేమన విశ్వవిద్యాలయం బొటానికల్ గార్డెన్ బాధ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఈ కప్పను పరిశీలించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.



దక్షిణ ఆసియాలో చాలా అరుదుగా కనిపించే ఎల్లో ఫ్లయింగ్ ఫ్రాగ్ (ఎగిరే కప్ప) శాస్త్రీయ నామం పాలీపెడటస్‌ మాక్యులటస్‌ అంటారు. దీనినే తెలుగులో ఎగిరే కప్ప అని పిలుస్తారు. ఈ కప్ప చర్మం తిని మనుగడకు ఎన్నో విధులను నిర్వర్తిస్తుందని డాక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కప్ప పొత్తికడుపు పై ఉండే సన్నని రంధ్రాల ద్వారా నీటిని గ్రహిస్తుంది. దీనినే పెల్విక్‌పాచ్‌ అని పిలుస్తారు.అలాగే ఈ కప్ప లు లు ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్ తీసుకొని శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్ ను చర్మం ద్వారా బయటకు వదులుతాయి.

ఎంతో అరుదుగా కనిపించే ఈ జాతికి చెందిన కప్ప పంట పొలాల్లో మొక్కలకు హాని కలిగించే క్రిమికీటకాలను తింటూ పర్యావరణ హితంగా మొక్కల సంరక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తుంది. అరుదైన ఎల్లో ఫ్లయింగ్ ఫ్రాగ్ ను1830 వ సంవత్సరంలో జాన్‌ ఎడ్వర్డ్‌ గ్రే కనుగొన్నట్లు డాక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ అరుదైన ఎగిరే కప్ప యోగి వేమన విశ్వవిద్యాలయంలో కనిపించడంతో పెద్ద ఎత్తున స్థానికులు దీనిని చూడటానికి వచ్చారు.


Next Story