అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపండి
పశ్చిమ బైపాస్ నిర్మాణంలో అధికారుల అలసత్వం వల్లే రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచిందని రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు
By Knakam Karthik
వారి అలసత్వం వల్లే రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచింది: మంత్రి నారాయణ
అమరావతి: పశ్చిమ బైపాస్ నిర్మాణంలో అధికారుల అలసత్వం వల్లే రాజధాని ప్రాంతంలో వరద నీరు నిలిచిందని రాష్ట్ర మంత్రి నారాయణ చెప్పారు. మంగళగిరి మండలంలో వరద నీరు నిలిచిన ప్రాంతాలలో మంత్రి నారాయణ, ఏడీసీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి పర్యటించారు. మంగళగిరి మండలం కురగల్లు సమీపంలో జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మించిన సిల్ట్ తీయకపోవడంతో వరద నీరు కిందకు వెళ్లలేదని మంత్రి చెప్పారు. సుమారు 25 అడుగుల మేర మట్టి ఉందని...దానిని తొలగించాలంటే వెంటనే సాధ్యం కానందునే బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిని కొంత మేర తొలగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జాతీయ రహదారికి గండికొట్టిన 24 గంటల్లో వరద నీరు వెళ్లిపోతోందన్నారు. ఆ వెంటనే బ్రిడ్జి కింద పేరుకుపోయిన సిల్ట్ తొలగించిన తర్వాత జాతీయ రహదారి మరమ్మతులు పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
అమరావతిపై ఇకనైనా మీ ఏడుపులు ఆపాలంటూ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. లేదంటే ఈసారి ఆ 11 సీట్లు కూడా ప్రజలు మీకివ్వరన్నారు...ఎక్కడైనా నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా...?గుంతల్లోకి నీరు వస్తె ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా?అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు..అమరావతిపై దుష్ప్రచారం చేస్తే ప్రజలు సహించరని అన్నారు...పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండటంతో నీరు నిలిచిపోయిందన్న మంత్రి...అది కూడా కేవలం రెండు గ్రామాల పరిధిలో మాత్రమే పొలాల్లో నీరు నిలిచిందన్నారు.మిగతా గ్రామాల్లో వర్షం పడిన కొన్ని గంటల్లోనే నీరు బయటికి వెళ్లిపోయిందన్నారు...ప్రస్తుతం కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టిని వేగంగా తొలగించే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి..ఎవరెన్ని అనుకున్నా అమరావతి పనులు జరిగిపోతూనే ఉంటాయన్నారు..వచ్చే మార్చి నాటికి అధికారులు,ఉద్యోగుల క్వార్టర్లు కూడా సిద్దం చేస్తున్నామన్నారు...రాజధాని మునిగిపోయిందని ప్రచారం చేస్తున్న వారు అమరావతికి వచ్చి పరిస్థితి చూడాలని మంత్రి సూచించారు.