Tirumala: ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి.

By -  Knakam Karthik
Published on : 2 March 2026 8:21 PM IST

AndhraPradesh, Tirupati, Tirumala, Teppotsavam, SrivariPushkarini, MalayappaSwamy, TTD, FloatFestival

Tirumala: ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల చివరి రోజున మలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారి పుష్కరిణిలో ఏడు చుట్లు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు పుష్కరిణి మెట్లపై ఆసీనులై గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.

మొదటి రోజు శ్రీరాముడి అలంకారంలో, రెండో రోజు శ్రీకృష్ణుడి అలంకారంలో భక్తులకు కనువిందు చేసిన స్వామివారు, చివరి మూడు రోజులు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ మరియు పోలీసులు పటిష్టమైన భద్రత, లైటింగ్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ వార్షిక తెప్పోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story