తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆర్టీసీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. వివ‌రాళ్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఆర్టీసీ బస్సులో శనివారం ఉదయం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపి, ప్రయాణికులను దింపేశాడు.

కాకినాడ నుంచి హైదరాబాద్‌ బయలుదేరిన ఆర్టీసీ బ‌స్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బయలుదేరిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్ర‌మాద‌ స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.


సామ్రాట్

Next Story