గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్‌గేట్ లో ఈ రోజు సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి గుంటూరు వెళుతున్న లారీ పూర్తిగా దగ్దం అయింది. లారీ తమిళనాడుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లింపు చేస్తున్న సమయంలో లారీ టైర్ ఒక్కసారిగా పేలటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ఆ మంటలు ఆయిల్ ట్యాంక్ కు వ్యాపించడంతో మరింత వేగంగా మంటలు వ్యాపించాయి. లారీకి కుడి, ఎడమ వైపుల ఉన్న రెండు టోల్ బాక్స్ లు మంటలో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. లారీలో ఎలాంటి లోడు లేకపోవడంతో.. మంటలను అదుపులోకి తీసుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణం లారీ టైరు పేలటమే అని ప్రాధమికంగా అంచనాకు వచ్చారు.


సామ్రాట్

Next Story