Andhrapradesh: త్రిశూలంతో రిపోర్టర్‌పై మహిళా అఘోరి దాడి.. మూడు వారాల్లో మూడో ఘటన
మంగళగిరిలో సోమవారం సాయంత్రం చెన్నై-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్)పై మహిళా అఘోరీ నాగ సాధ్వి నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 19 Nov 2024 8:46 AM ISTAndhrapradesh: త్రిశూలంతో రిపోర్టర్‌పై మహిళా అఘోరి దాడి.. మూడు వారాల్లో మూడో ఘటన
విజయవాడ: మంగళగిరిలో సోమవారం సాయంత్రం చెన్నై-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్)పై మహిళా అఘోరీ నాగ సాధ్వి నిరసన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. గత మూడు వారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అఘోరీ ఒక గ్యారేజీకి వచ్చి ఆమె కారు వాష్ కోసం అడిగింది. ఈ క్రమంలోనే ఓ వార్తా విలేఖరి ఫోటోలు, వీడియోలను తీయడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె త్రిశూలం తీసి అతనిపై దాడి చేసింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్థానికులు కొందరిని కూడా గాయపరిచింది.
అనంతరం ఆమె జనసేన పార్టీ కార్యాలయం దగ్గర్లోని ఎన్‌హెచ్‌పై బైఠాయించింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆమె ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం అఘోరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె మహిళా పోలీసులపై దాడి చేసింది. దుస్తులు ధరించమని పోలీసులు ఆమెను ఒప్పించి పరిస్థితిని అదుపు చేశారు.
ఆమె మంగళగిరి పర్యటన ఉద్దేశ్యం ఇంకా తెలియనప్పటికీ, ఆమె ప్రస్తుతం తన కారులో ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలను సందర్శిస్తున్నట్లు స్థానికులు కొందరు తెలిపారు. ఇలాంటి ఘటనలో నవంబర్ 7న తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీకాళహస్తి ఆలయంలో ఓ అఘోరి ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించి భయాందోళనకు గురి చేసింది. ఎందుకంటే ఆమె బట్టలు వేసుకోలేదు. వాగ్వాదం చెలరేగింది. అఘోరీ ఆమె కారు నుండి పెట్రోల్ క్యాన్ తీసి, ఆమె శరీరంపై పోసి, ఆత్మహత్యకు ప్రయత్నించింది. పోలీసులు పెట్రోల్ క్యాన్ లాక్కొని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
రెండు వారాల క్రితం నక్కపల్లి టోల్‌గేట్ సమీపంలో ఓ అఘోరి టోల్‌గేట్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించింది. టోల్ సిబ్బందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. టోల్ గేట్ సిబ్బంది, స్థానికులు కొందరు తనను అనుచితంగా తాకారని, తర్వాత క్షమాపణలు చెప్పారని అఘోరీ పేర్కొంది. అలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె వాదించారు.
"నాగ సాధ్వి' పరిస్థితి ఇలా ఉంటే, సమాజంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఉంటుంది? సిబ్బంది అలా ఎలా ప్రవర్తిస్తారు? అతనిని (బాధ్యుడిని) అదుపులోకి తీసుకోవాలి. 'కలియుగం' మారుతోంది అనడానికి కారణం ఇదే'' అని ఆమె ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది.