ఏపీకి కొత్త వైర‌స్ భ‌యం.. రాజ‌మండ్రిలో కొత్త క‌రోనా స్ట్రెయిన్ క‌ల‌క‌లం

Fear of a new virus for the AP. కొత్త‌ర‌కం క‌రోనా వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. 2020లో ప్ర‌పంచాన్ని

By Medi Samrat  Published on  24 Dec 2020 7:25 AM GMT
ఏపీకి కొత్త వైర‌స్ భ‌యం.. రాజ‌మండ్రిలో కొత్త క‌రోనా స్ట్రెయిన్ క‌ల‌క‌లం

కొత్త‌ర‌కం క‌రోనా వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. 2020లో ప్ర‌పంచాన్ని వ‌ణికించిన క‌రోనా మ‌హ‌మ్మారికి వాక్సిన్ దొరికింద‌ని సంతోష‌ప‌డే లోపే కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ భ‌య‌పెడుతోంది. తాజాగా ఈ వైర‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పాకిన‌ట్లు తెలుస్తోంది. యూకే నుంచి తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌చ్చిన ఓ మ‌హిళ‌కు పాజిటివ్‌గా తేల‌డంతో.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. సంభందిత మ‌హిళ ఏపీ ఏక్స్‌ప్రెస్‌లో ఈ నెల 22న ఢిల్లీలో బ‌య‌లు దేరి బుధ‌వారం రాత్రి రాజ‌మండ్రి చేరుకుంది. వెంట‌నే ఆమెను రెవెన్యూ, వైద్య ఆరోగ్య‌శాఖ‌, పోలీసులు అధికారులు 108 వాహ‌నంలో రాజ‌మండ్రి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. మ‌హిళ‌తో పాటు ఆమె కుమారుడికి సైతం పీపీఈ కిట్లు వేసి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే.. స‌ద‌రు మ‌హిళ‌కు సోకిన వైర‌స్ పాత‌దా కొత్తదా అన్న‌ది ఇంకా నిర్థార‌ణ కాలేదు. సెప్టెంబ‌ర్ నుంచి బ్రిట‌న్‌లో కొత్త వైర‌స్ ప్ర‌బ‌లుతోన్న సంగ‌తి తెలిసిందే. సాధారణ కరోనా కంటే కరోనా స్ట్రెయిన్ ప్రమాదకరంగా మారడంతో పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉన్నట్లు ప్రకటించింది. కొత్తరకం వైరస్ పై నిరంతరం సమీక్ష జరుపున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా తమ వివరాలని వైద్య ఆరోగ్యశాఖ వెబ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. పోర్టల్ లో నమోదు చేసుకోని ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతిచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తెలిపింది.


Next Story
Share it