నేడు దేశ‌వ్యాప్తంగా రైల్‌రోకో

Farmers' Body 'Rail Roko' Protest Today Over Farmers' Killing In UP. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ల‌ఖింపూర్ ఖేరీలో జ‌రిగిన హింసాత్మ‌క‌ ఘ‌ట‌న‌పై దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు

By Medi Samrat  Published on  18 Oct 2021 2:44 AM GMT
నేడు దేశ‌వ్యాప్తంగా రైల్‌రోకో

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ల‌ఖింపూర్ ఖేరీలో జ‌రిగిన హింసాత్మ‌క‌ ఘ‌ట‌న‌పై దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. రైతుల ర్యాలీపైకి కేంద్ర‌మంత్రి కుమారుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని కారు దూసుకుపోవ‌డంతో న‌లుగురు రైతులు మృతి చెందారు. ఆ త‌రువాత జ‌రిగిన సంఘ‌ట‌న‌లో మ‌రో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అశిశ్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్ర‌శ్నిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే, ఈ ఘ‌ట‌న‌పై రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. ఆశిశ్ మిశ్రాతో పాటుగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి అజ‌య్ మిశ్రాపై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు దేశ‌వ్యాప్త రైల్‌రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈరోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు రైల్‌రోకో జరుగుతుంద‌ని రైతు సంఘాలు పేర్కొన్నాయి.


Next Story