ఎమ్మెల్యే విడదల రజనికి వీరాభిమాని.. ఏకంగా..

Fan Of Vidadala Rajini. సాధారణంగా తమ కుటుంబ సభ్యుల పేర్లను, ఫోటోలను పచ్చబొట్టులు పొడిపించుకుంటూ ఉంటారు

By Medi Samrat  Published on  18 Sep 2021 8:56 AM GMT
ఎమ్మెల్యే విడదల రజనికి వీరాభిమాని.. ఏకంగా..

సాధారణంగా తమ కుటుంబ సభ్యుల పేర్లను, ఫోటోలను పచ్చబొట్టులు పొడిపించుకుంటూ ఉంటారు. ఇంకా ఎక్కువగా అభిమాన హీరోలు, హీరోయిన్ల ముఖాలను కూడా వేయించుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ పనిని ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రజిని అభిమాని చేసి చూపించాడు. చామన్‌పల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దూడం అనిల్‌కుమార్‌ ఎమ్మెల్యే రజిని అభిమాని.. అభిమాని అంటే సరిపోదు.. వీరాభిమాని అనాలి అతడిని. ఆమె ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాలను ఫాలో అవుతూ ఎమ్మెల్యే చేపట్టే కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు.

3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో అనిల్‌కు కాలు విరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ఎమ్మెల్యేకు తెలుపగా రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. అంతే ఆమెపై మరింత అభిమానాన్ని పెంచుకొని.. ఇటీవల చేతిపై ఎమ్మెల్యే రజిని చిత్రాన్ని టాటూ వేయించుకున్నాడు. ఈ ఫొటోను ఆమెకు పోస్టు చేయగా ప్రత్యక్షంగా కలవాలని సూచించారు. శుక్రవారం చిలుకలూరిపేట వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. కాసేపు అనిల్‌తో మాట్లాడి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భోజనం పెట్టి, సన్మానించారు. తన స్వగ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నానని అనిల్‌ చెప్పగా ప్రస్తుతానికి రూ.50 వేల చెక్కు అందజేశారు.


Next Story