సీఎం జ‌గ‌న్‌కు 'సిరివెన్నెల' కుటుంబ స‌భ్యులు కృతజ్ఞత‌లు

Family members of 'Sirivennela' thank CM Jagan. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు కృతజ్ఞత‌లు

By Medi Samrat  Published on  1 Dec 2021 11:27 AM GMT
సీఎం జ‌గ‌న్‌కు సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు కృతజ్ఞత‌లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు కృతజ్ఞత‌లు తెలియ‌జేశారు. న‌వంబ‌ర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు సీఎం జ‌గ‌న్‌ కార్యాలయం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆరోగ్య పరిస్థితులపై ఎంక్వయిరీ చేస్తూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ సారాంశ‌మేమిటంటే.. ఆసుపత్రి ఖర్చులన్ని భరించమని సీఎం జగన్ ఆదేశించినట్లుగా తెలియజేశారు. అయితే.. అదే సాయంత్రం 4.07 గంటలకు సిరివెన్నెల‌ స్వర్గస్తులైనారు.

సిరివెన్నెల మ‌ర‌ణ‌వార్త తెలిసిన సీఎం జ‌గ‌న్‌ సంతాపాన్ని తెలియజేశారు. సిరివెన్నెల‌ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి హాజరై, ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తూ.. మేము కట్టిన అడ్వాన్స్‌ని కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశార‌ని సిరివెన్నెల కుటుంబ స‌భ్యులు తెలిపారు. సిరివెన్నెల పట్ల ఇంతగా ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధ‌న్య‌వాదాలు తెలిపారు కుటుంబ సభ్యులు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.


Next Story