అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని నిందితులుగా గర్తించారు. మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు కూడా ఉన్నారు. మరో ఏడుగురు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు ఎక్సైజ్ పోలీసులు నిందితులను కస్టడీకి ఇవ్వాలని తంబళ్లపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విని 10 నిందితులను 3 రోజుల పాటు ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావు అరెస్ట్‌పై పీటీ వారెంట్ దాఖలు చేయగా తంబళ్లపల్లి కోర్టు పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.