గుడ్‌న్యూస్..అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

రాష్ట్రంలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By -  Knakam Karthik
Published on : 27 Oct 2025 1:16 PM IST

Andrapradesh, Amaravati, unauthorized layouts, Ap Government

గుడ్‌న్యూస్..అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

అమరావతి: రాష్ట్రంలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో మూడు నెలలపాటు గడువు పొడిగిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా ఈ నెల 23తో గడువు ముగిసింది. అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో జనవరి 23 వరకూ లే అవుట్లు, ప్లాట్‌లు రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఏపీ సర్కార్ కల్పించింది.

ఈ పథకం కింద 2025 జూన్ 30కి ముందు వేసిన లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఈ గడువు పొడిగింపు వల్ల మరింత మంది అనధికార లే అవుట్ యజమానులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. పురపాలక, నగరపాలక, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అనధికార లే అవుట్లు ఈ పథకం కిందకు వస్తాయి.

Next Story