నా హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంది : టీడీపీ నేత‌ సంచలన వ్యాఖ్యలు

Exminister Devineni Uma Sensational Comments. వైసీపీ మీద ఎప్పుడు చూసినా ఒంటి కాలి మీద లేచే టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు

By Medi Samrat  Published on  8 July 2023 8:15 PM IST
నా హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంది : టీడీపీ నేత‌ సంచలన వ్యాఖ్యలు

వైసీపీ మీద ఎప్పుడు చూసినా ఒంటి కాలి మీద లేచే టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ దేవినేని ఉమ ఆరోపణలు చేశారు. రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కు గ్యారంటీ బస్సు యాత్రలో దేవినేని ఉమా ఈ కామెంట్స్ చేశారు. నన్ను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి.. నన్ను ఎప్పుడైనా తుదముట్టించవచ్చని దేవి నేని ఉమ చెప్పుకొచ్చారు.

కొండపల్లిలో నా కారుపై బండరాయితో దాడి చేశారు.. కారుడోర్ తీసి ఉంటే నాతో పాటు మరికొందరు చనిపోయేవారన్నారు. అంతేకాకుండా పడవ మునిగినప్పుడు గోదారితల్లి నన్ను బతికించింది.. అంటూ బస్సుయాత్రలో దేవినేని ఉమ అన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తన జీవిత ఆశయం ఒక్కటేనని చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని నాగార్జున సాగర్ కాలువల్లో పారిస్తానని హామీనిచ్చారు.

తనను చంపేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఏప్పుడైనా తనను చంపేయొచ్చని చెప్పారు. దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు దేవినేని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Next Story