టీడీపీలో చేర‌నున్న రఘు రామకృష్ణంరాజు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) మాజీ ఎంపీ కె.రఘు రామకృష్ణంరాజు టీడీపీలో చేరే అవకాశం ఉంది.

By Medi Samrat  Published on  25 March 2024 7:04 PM IST
టీడీపీలో చేర‌నున్న రఘు రామకృష్ణంరాజు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) మాజీ ఎంపీ కె.రఘు రామకృష్ణంరాజు టీడీపీలో చేరే అవకాశం ఉంది. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రఘు రామకృష్ణంరాజు త్వరలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ ఆరు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. అరకు, రాజమహేంద్రవరం, తిరుపతి, రాజంపేట, అన‌కాపల్లె, నర్సాపురం స్థానాలకు బీజేపీ ఆరుగురు అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించింది. రఘు రామకృష్ణం రాజు పార్టీలో చేరకపోవడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ అధిష్టానం పరిగణించలేదు. బదులుగా శ్రీనివాస వర్మకు టిక్కెట్‌ ఇచ్చారు.

నెల రోజుల క్రితమే రఘురామకృష్ణంరాజు వైఎస్సార్‌సీపీని వీడారు. 2019 ఎన్నికల్లో రఘురామ నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆరు నెలల గ‌డిచేలోపే ఆయ‌న‌ వివిధ కీలక విషయాలలో వైఎస్సార్సీపీ నాయకత్వంతో విభేదించడం ప్రారంభించాడు. పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన కూటమి బహిరంగ సభలో రఘురామకృష్ణంరాజు నర్సాపురం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ బీజేపీని ప్రభావితం చేశారని రఘురామకృష్ణంరాజు టికెట్ నిరాకరించిన తర్వాత ఆరోపించారు. జగన్‌మోహన్‌రెడ్డికి బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో ఉన్న సాన్నిహిత్యంపై నాకు మొదటి నుంచి అనుమానం ఉంది. వీరిద్దరూ బీజేపీ నాయకత్వాన్ని ప్రభావితం చేశార‌ని ఆరోపించారు.

Next Story