సూపర్ సిక్స్ పథకాల డైవర్షన్ కోసమే ఇవన్నీ : మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పాలనపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

By Medi Samrat
Published on : 19 Aug 2024 9:09 PM IST

సూపర్ సిక్స్ పథకాల డైవర్షన్ కోసమే ఇవన్నీ : మార్గాని భరత్

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పాలనపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలల పాలనలో అల్లర్లు, అరాచకాలు తప్ప మరేమీ లేదని భరత్ అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. మదనపల్లిలో చంద్రన్న ఫైల్స్ మొదలుపెట్టారని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలను పక్కనపెట్టడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు.

సూపర్ సిక్స్ పథకాల గురించి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు అండ్ కో కొత్త కథలు అల్లుతున్నారన్నారు మార్గాని భరత్. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, చంద్రబాబు చంద్రన్న ఫైల్స్ నడుపుతున్నారు తప్పితే ఏపీలో ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదన్నారు. పోలవరంలో డయాఫ్రం వాల్ చంద్రబాబు వల్ల దెబ్బతిన్నదని నిపుణులు తేల్చి చెప్పారని.. కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్ల నష్టం జరిగిందని ఆరోపించారు. అమాయకులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, వాస్తవాలను బయటకు తీయాలన్నారు.

Next Story