వైసీపీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంశీకి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది తలెత్తడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ, మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి13న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యారు. ఆతర్వాత ఆయనపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సహా మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. వంశీపై నమోదైన 11 కేసుల్లోనూ బెయిల్ మంజూరు కావడంతో వంశీ జైలు నుంచి విడుదలయ్యారు.