టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే సత్య ప్రభ బెంగళూరులో కన్నుమూశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, చిత్తూరు మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు సతీమణి సత్యప్రభ. ఈమె 2014 ఎన్నికలలో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుత జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు.
కరోనా సోకడంతో చికిత్స పొందుతున్న సత్యప్రభ గత రాత్రి 11 గంటలకు మృతి చెందారు. సత్యప్రభ మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం బెంగళూరులోని వైదేహి హాస్పిటల్ క్యాంపస్ ఆవరణలో ఆమె దహన సంస్కారాలు జరుగనున్నాయి.