జ‌గ‌న్‌కు శవ రాజకీయాలంటే ఇష్టం : మాజీ మంత్రి సోమిరెడ్డి

అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.

By -  Medi Samrat
Published on : 13 Feb 2026 3:43 PM IST

జ‌గ‌న్‌కు శవ రాజకీయాలంటే ఇష్టం : మాజీ మంత్రి సోమిరెడ్డి

అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. జగన్ మోహన్ రెడ్డిని మర్చంట్ ఆఫ్ డెత్ అంటూ అభివర్ణించారు సోమిరెడ్డి. జగన్ మోహన్ రెడ్డికి విధ్వంసం అంటే ఇష్టం.. శవ రాజకీయాలంటే ఇష్టం అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ డిక్కీలో శవాన్ని వేసుకుని వచ్చిన తన ఎమ్మెల్సీ భుజాన్ని తడతాడు.. కానీ, తన ర్యాలీలోనే కార్యకర్తలు చనిపోతే కనీసం పరామర్శకు పోడు అని దుయ్య‌బ‌ట్టారు. బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తాడు.. ర్యాలీలు చేపడతాడు.. ఆ ర్యాలీల్లో ఒకరో ఇద్దరో చనిపోయేలా చేస్తారు.. అందుకే జగన్‌ను మర్చంట్ ఆఫ్ డెత్ అని అంటానన్నారు. శవ రాజకీయాలు చేసేందుకు జగన్ రాజకీయ పార్టీని స్థాపించాడని.. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల తల్లులను, తండ్రులను దూషించిన నేతలను కనీసం కట్టడి చేయడన్నారు. తల్లిదండ్రులను దూషించిన వారిని శిక్షించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు.

Next Story