జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవారు.. గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌న‌పై రోజా ఫైర్

ఆంధ్ర‌ప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి రోజా అన్నారు. శ‌నివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత‌రం రోజా మీడియాతో మాట్లాడుతూ..

By Medi Samrat
Published on : 31 Aug 2024 2:45 PM IST

జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవారు.. గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌న‌పై రోజా ఫైర్

ఆంధ్ర‌ప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రి రోజా అన్నారు. శ‌నివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత‌రం రోజా మీడియాతో మాట్లాడుతూ.. గుడ్ల‌వ‌ల్లేరు ఘ‌ట‌న‌పై ఫైర్ అయ్యారు. కాలేజీ బాత్రూంలో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని.. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలని అన్నారు. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం అన్నారు. జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్లన్నారు. ముచ్చుమర్రిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదని.. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్లలేదని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

నేను ఏ పార్టీ మారడం లేదని ఊహాగానాల‌పై స్పందించారు. పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలని సల‌హా ఇచ్చారు. 2014-19 మధ్యలో కూడా చాలా మంది పార్టీ మారారని అన్నారు. పార్టీ మారడం వల్ల జగన్ కు, వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరని మాజీ మంత్రి రోజా కామెంట్ చేశారు.

Next Story