చంద్రబాబు బినామీలతో అమరావతి రైతుల పాదయాత్ర జరుగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పాదయాత్రలో చంద్రబాబు మనుషులు మాత్రమే ఉన్నారు. పాదయాత్రలో రైతులెవరూలేరని.. పచ్చ కండువా కప్పుకుని పాదయాత్రలో తిరుగుతున్నారని విమర్శించారు. ప్రజాదరణలేని టీడీపీ యాత్రకు ఖర్చు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. పేదల ఆర్థిక స్థితిగతులు మార్చడమే వైఎస్ఆర్ సీపీ లక్ష్యం అని స్పష్టం చేశారు.
ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ గురించి రాద్దాంతం చేస్తున్న చంద్రబాబు.. ఎన్‌టీఆర్‌ను ఎంత మానసిక క్షోభకు గురిచేశాడో అందరికీ తెలుసనని.. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. చివరిగా అసెంబ్లీలో మాట్లాడుతానని.. ఎన్టీఆర్ బతిమిలాడుకుంటే.. మార్షల్స్‌తో బయటకు గెంటించాడని విమర్శించారు. మొదటి మహానాడులో ఎన్టీఆర్ ఫోటో లేకుండా చేశారు. ఎన్టీఆర్ మరణించాక ఎనలేని భయభక్తులు చూపించారని విమర్శనాస్త్రాలు సంధించారు.