మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య ఈరోజు ఉదయం తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. పలమనేరులో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున పట్నం సుబ్బయ్య ఎన్టీఆర్ పిలువు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా.. ఎన్టీఆర్ హయాంలో రెండు సార్లు మంత్రిగా(పౌరసరఫరాల,ఆరోగ్య శాఖ మంత్రి) కూడా పనిచేశారు.
2014లో ఆయన బీజేపీలో చేరిన ఆయన.. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయన మళ్ళీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఒడిపోవడంతో ఆయన తిరిగి మళ్ళీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రెండు సార్లు మంత్రి గా పనిచేసిన ఆయన చనిపోయేవరకు కూడా సాధారణ జీవితం గడిపారు.
కొద్దికాలం క్రితం గుండెకు ఆపరేషన్ చేసుకున్న సుబ్బయ్య.. ఈరోజు ఉదయం ఆయన స్వగ్రామమైన ఐరాల మండలం కొత్తపల్లిలో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు తమ సంతాపం తెలిపారు.