అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

Ex Minister Kollu Ravindra Fire On CM Jagan. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో ‎నిత్యం హత్యలు, దాడులు, మహిళలపై

By Medi Samrat  Published on  5 Jun 2022 12:24 PM GMT
అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో ‎నిత్యం హత్యలు, దాడులు, మహిళలపై మానభంగాలతో రాష్ట్రం వల్లకాడులా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ద్వజమెత్తారు. ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాచర్లలో టీడీపీ బీసీ కార్యకర్త జల్లయ్య హత్య దుర్మార్గమ‌ని అని అన్నారు. ఇది ‎ ముమ్మూటికి వైసీపీ ప్రభుత్వ హత్యే. దీనికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అన్నారు.

3 ఏళ్లలో రాష్ట్రంలో 37 మంది టీడీపీ కార్యకర్తలను జగన్ రెడ్డి పొట్టన పెట్టుకున్నారు. వారిలో 26 మంది బీసీలేన‌ని అన్నారు. గతంలో మాచర్లలో తోట చంద్రయ్య, రాయలసీమలో నందం సుబ్బయ్య ఇలా 26 మంది బీసీలను జగన్ రెడ్డి పొట్టన పెట్టుకున్నారని. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జల్లయ్య కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా పోస్టుమార్టం చేసి పోలీసులు వారి బందువులపై లాటీ చార్జీ చేసి మృతదేహాన్ని బలవంతంగా సొంతూరుకి కాకుండా వినుకొండ నియోజకవర్గం రావులపాలెం తీసుకెళ్లారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా టీడీపీ నేతల్ని, బీసీ సంఘాల నేతల్ని హౌస్ అరెస్టులు చేయటం దుర్మార్గమ‌ని ఫైర్ అయ్యారు.

అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు. పోలీసులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ప్ర‌శ్నించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన స్వార్దం కోసం పల్నాడును వల్లకాడుగా మార్చారని ఆరోపించారు. తోట చంద్రయ్య ‍హత్య జరిగినపుడే పిన్నెల్లిపై హత్య కేసు నమోదు చేసి ఉంటే జల్లయ్య ‍హత్య జరిగేదా? అని ప్ర‌శ్నించారు. తోట చంద్రయ్య హత్య జరిగినపుడు స్వయంగా చంద్రబాబు నాయుడు చంద్రయ్య పాడె మోసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

పోలీసుల నిర్లక్ష్యం వల్లే జల్లయ్య హత్య జరిగింది. జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ బీసీలపై మారణ హోమం సాగిస్తూ ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా అణగద్రోక్కుతున్నారని ఆరోప‌ణ‌లు గుప్పించారు.

జగన్ రెడ్డి పాలనలో ఏ వర్గానికి రక్షణ లేదు. 10 మందికి మంత్రి పదవులిచ్చి వందల మంది ‎ ప్రాణాలు తీయడం ‎సామాజిక న్యాయమా.? .జ రాష్ట్రంలో బలహీన వర్గాలకు బ్రతికే స్వేచ్చ లేదా? అని ప్ర‌శ్నించారు. తన స్వార్దం కోసం కులాల మద్య చిచ్చు పెట్టారని.. కోనసీమలో కొత్త జిల్లా పేరుతో రెండు కులాల మద్య గొడవలు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ప్రశ్నిస్తే హత్యలు, దాడులు చేస్తున్నారు? మహిళపై రక్షణ లేదు, నిత్యం వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ విధ్యార్దులకు చంద్రబాబు ప్రవేశపెట్టిన పధకాలు రద్దు చేసి జగన్ రెడ్డి వారికి ద్రోహం చేశారని విమ‌ర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం బలహీన వర్గాలపై సాగిస్తున్న దమన కాండకు వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో బీసీ సంఘాల్ని కలుపుకుని పోరాటం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. మానవహక్కుల కమీషన్ కి, జాతీయ బీసీ కమిషన్ కి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామ‌ని.. అవసరమైతే న్యాయ పోరాటం సాగిస్తామని కొల్లు రవీంద్ర అన్నారు.






















Next Story