కొడాలి నాని అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు, కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సి యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమల కాళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

By Medi Samrat  Published on  31 Dec 2024 6:45 PM IST
కొడాలి నాని అనుచరుడు అరెస్ట్

మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు, కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సి యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమల కాళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుడివాడలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి ఆ పార్టీ నాయకుడు రావి వెంకటేశ్వరరావుపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు అరెస్టు చేశారు. ఇప్పటికే 13 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాళీని అస్సాంలో అరెస్టు చేశారు.

కాళీ అస్సాం వెళ్లి అక్కడ చేపల వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. వెంటనే కాళీ కదలికలపై నిఘా ఏర్పాటు చేసి మంగళవారం అరెస్ట్‌ చేశారు. త్వరలోనే నిందితుడిని గుడివాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.

Next Story