అలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో దత్తపుత్రుడు ఒక్కడే : అనిల్ కుమార్ యాదవ్

జనసేనాని పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

By Medi Samrat
Published on : 4 Nov 2023 7:45 PM IST

అలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో దత్తపుత్రుడు ఒక్కడే : అనిల్ కుమార్ యాదవ్

జనసేనాని పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని, రాజకీయంగా పైకి రావాలని పార్టీ పెడతారని, కానీ దత్తపుత్రుడు మాత్రం పక్క వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెట్టాడని.. బహుశా అలాంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో దత్తపుత్రుడు ఒక్కడేనని విమర్శించారు.

"దత్తపుత్రుడు ప్రతిసారి ఒక మాట చెబుతుంటాడు.. నా ఏకైక లక్ష్యం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడమే అంటాడు. జగన్ మోహన్ రెడ్డిని దించడం అంటే ఏమనుకుంటున్నాడో అర్థం కావడంలేదు. జగన్ మోహన్ రెడ్డిని దించడం నీ వల్ల కాదు కదా.. నీ అబ్బ తరం కూడా కాదు. నువ్వు పొత్తు పెట్టుకుని కట్టకట్టుకుని వచ్చినా ఏమీ చేయలేవు. ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు జగన్ మోహన్ రెడ్డిని కాపు కాసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయనను దించడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలతో ఒక పార్టీ మూత పడుతుందని.. మరో పార్టీ ఇంకో పార్టీలో కలిసిపోతుందని అనిల్ కుమార్ జోష్యం చెప్పారు.

Next Story