ప్రెస్ మీట్‌లో పెర్ఫార్మెన్స్ పీక్స్.. ఆచరణలో మ్యాటర్ వీక్ : మాజీ మంత్రి అనిల్

వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు

By Medi Samrat  Published on  13 Sept 2024 11:32 AM IST
ప్రెస్ మీట్‌లో పెర్ఫార్మెన్స్ పీక్స్.. ఆచరణలో మ్యాటర్ వీక్ : మాజీ మంత్రి అనిల్

వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. చంద్ర‌బాబు మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. 46 ఇయర్స్ ఇండస్ట్రీ గారు.. మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలు చూసి.. మీ విలువలు విశ్వసనీయత చూసి.. ప్రజలు నవ్వుకుంటున్నారు.. మీకు విశ్వసనీయత, విలువలు ఉన్నాయా? ప్రెస్ మీట్ లో పెర్ఫార్మెన్స్ పీక్స్.. ఆచరణలో మ్యాటర్ వీక్ అని ఎద్దేవా చేశారు. ప్రజా మద్దతుతో గెలవకుండా ఉన్నటువంటి రాజ్యసభ, ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి తీసుకుంటున్నామని గొప్పలు చెప్పే మీరు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేయించి తీసుకునే దమ్ముందా..? అని స‌వాల్ విసిరారు. 15 రోజుల క్రితం మీరు మాట్లాడిన మాటలలో మీకు ప్రజాక్షేత్రంపై ఎంత గౌరవం, విలువలు ఉన్నాయో బాగా అర్థం అవుతోంది.. 46 ఇయర్స్ ఇండస్ట్రీ గారు అంటూ సెటైర్లు సంధించారు.


Next Story