ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనపై పట్టాభిపురం, మంగళగిరి, నగరంపాలెం, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణను ఫిబ్రవరి 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పీఎస్ లో నమోదైన కేసులో తప్పనిసరిగా బీఎన్ఎస్ 35(3)ను అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన 5 కేసులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అంబటిపై పీటీ వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.